“RRR”..ఈ కీలక సన్నివేశాలు కూడా ఇందులోనే.!

“RRR”..ఈ కీలక సన్నివేశాలు కూడా ఇందులోనే.!

Published on Mar 25, 2021 5:11 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల కితమే చరణ్ మరియు ఆలియా భట్ లపై ఓ అద్భుతమైన సాంగ్ ను ప్లాన్ చేసారని టాక్ వచ్చింది.

సాబు సిరిల్ నేతృత్వంలో ఓ భారీ సెట్ ను కూడా ఈ సాంగ్ కోసం వేశారని వినిపింది. మరి ఇదిలా ఉండగా మరో గాసిప్ కూడా బయటకొచ్చింది. ఈ షెడ్యూల్ లో కేవలం ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా తెరకెక్కించనున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సహా మరికొందరు కీలక నటులు నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అక్టోబర్ 13న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు