దర్బార్ నుండి మూడో సాంగ్ నేడే

దర్బార్ నుండి మూడో సాంగ్ నేడే

Published on Dec 28, 2019 3:44 PM IST

darbar

రజిని కాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ చాలా కాలం తరువాత పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రంలోని మూడవ సాంగ్ నేడు సాయంత్రం 6గంటలకు విడుదల కానుంది. నిఖార్సైన బ్రహ్మచారిని… అనే ఈ సాంగ్ కి సాహిత్యం భాస్కర భట్ల అందించారు. ఇన్నో గెంగా ఈ పాటను పాడారు.

అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. నివేదా థామస్ కూడా ఓ రోల్ చేస్తున్నారు. రజిని నుండి వస్తున్న చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు