38 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించనున్న ప్రముఖ నటుడు?

38 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించనున్న ప్రముఖ నటుడు?

Published on May 27, 2024 11:00 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలో బాహుబలి సిరీస్‌లతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సత్యరాజ్ తారాగణంలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.

38 సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌తో అతను నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ నుండి అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు