టాలెంటెడ్ యాక్టర్ నారా రోహిత్ ఇటీవల ‘భైరవం’లో కీలక పాత్ర చేసినా ఆ సినిమా పెద్దగా నిలబడలేదు. ‘సుందరకాండ’లో హీరోగా డిఫరెంట్ ఎంటర్‌టైనర్ చేసినా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. అయితే, ఈ హీరో ఇప్పుడు విలక్షణ పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ‘పుష్ప’ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మొదట తనకే వచ్చిందని, కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యిందని రోహిత్ వెల్లడించాడు. ఆ పాత్ర చేసుంటే అతనికి పెద్ద బ్రేక్ వచ్చి ఇతర భాషల్లో అవకాశాలు వచ్చేవేమో అన్న చర్చ అప్పట్లో జరిగింది. అయితే, ఇప్పుడు వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నాడని సమాచారం.
అఫీషియల్ ప్రకటన లేకపోయినా, ఈ కీలక పాత్ర రోహిత్ కెరీర్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌గా మారే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాను సమ్మర్ ట్రీట్‌గా అందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
