నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ మాస్ ఎంటర్టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.
ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర ఉండబోతోందని, అది ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తుందని సమాచారం. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారని, తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లారని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
