ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిన అంజలి!

ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిన అంజలి!

Published on Apr 4, 2024 11:15 AM IST

అంజలి (Anjali) ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో, డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది అంజలి హ్యాట్రిక్ హిట్స్ కొట్టేందుకు రెడీ అయిపోయింది.

ఈ చిత్రం ఏప్రిల్ 11, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. అదే విధంగా విశ్వక్ సేన్ (Viswak సేన్) హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో కీలక పాత్రలో నటించింది. మే 17 న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game changer) లో కీ రోల్ లో నటిస్తుంది. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు