నిఖిల్ ’18 పేజెస్’ లో యంగ్ బ్యూటీ ?

Published on Jun 1, 2020 5:54 pm IST

యంగ్ హీరో నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం యంగ్ బ్యూటీ సిద్ధి ఇద్నానిను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ సినిమా రాబోతుంది. ఇక ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాడు నిఖిల్. అన్నట్లు ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More