విక్రమ్ “తంగలాన్” కి ఈ అంశం చాలా యూనిక్ గా

విక్రమ్ “తంగలాన్” కి ఈ అంశం చాలా యూనిక్ గా

Published on Apr 25, 2024 10:11 AM IST

కోలీవుడ్ వెర్సటైల్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ఇప్పుడు పలు వినూత్న ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో టాలెంటెడ్ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “తంగలాన్” కూడా ఒకటి. మరి టీజర్ తో ఒక్కసారిగా భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

ఈ సినిమాకి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందిస్తుండగా తను ఈ సినిమాకు ఒక యూనిక్ సౌండ్ డిజైన్ ని ట్రై చేస్తున్నాడట. ఇది థియేట్రికల్ గా చాలా మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది అని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సినిమా విజువల్ గా సౌండ్ పరంగా ఎలాంటి ట్రీట్ ని అందిస్తుంది అనేది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటించగా నీలం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ రానున్న ఎన్నికల తర్వాత సినిమా రిలీజ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు