బిగ్ బాస్ – టైటిల్ విన్నింగ్ పై ఈ కీలక కంటెస్టెంట్ తల్లి నమ్మకం.!

Published on Nov 5, 2020 5:52 pm IST

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మన తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ నుంచి ఇప్పుడు నాలుగో సీజన్ వరకు కూడా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న నాలుగో సీజన్లో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి.

అయితే ఈ శ్లో మొదటి నుంచి కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తున్న కంటెస్టెంట్ అభిజీత్ విషయంలో లేటెస్ట్ జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఇతర అంశాలు మన్హసి హీటెక్కించాయి. అలాంటి అభిజీత్ కోసం అతడి తల్లి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అభిజీత్ భుజానికి ఒక పెద్ద ఫ్రాక్చర్ అయ్యిందని అందుకే అతడు శారీరిక టాస్కులు దూరంగా ఉంటున్నాడని తెలిపారు.

అలాగే అభిజీత్ తమ ఇంట్లో చాలా కామ్ గా ఉంటాడని అంతే కాకుండా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడని ఆమె తెలిపారు. అంతే కాకుండా అభిజీత్ ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నవుతాడని చాలా నమ్మకంగా తెలిపారు. మరి అభిజీత్ తన తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :