ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.!

Published on Sep 27, 2020 4:34 pm IST

ప్రస్తుతం మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 మంచి డీసెంట్ రేటింగ్ తో అలా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ షో లో ఎప్పటిలాంటి ప్రతీ వారాంతం ఎలిమినేషన్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఈసారి నిన్న శనివారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యినట్టుగా చూపించారు. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు బయటకెళ్లిపోనున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ ఎలిమినేషన్ కూడా సస్పెన్షఫుల్ గా ఉండనుంది అని తెలుస్తుంది. అయితే ఈరోజు బిగ్ బాస్ ఇంటి నుంచి దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వనుంది అట. అలాగే ఈ ఎలిమినేషన్స్ తో పాటు ఈరోజు ఎపిసోడ్ లో కొన్ని ఊహించని ట్విట్లు కూడా ఉంటాయని టాక్. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే కింగ్ నాగ్ హోస్ట్ చెయ్యబోయే ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More