బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్ ఓవర్ సింపతీ ప్లే చేస్తుందా.?

ఇంకొన్ని రోజుల్లో ముగిసిపోనున్న మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఒక్కో కంటెస్టెంట్ కు సంబంధించి మరింత విషయాన్ని ఆడియెన్స్ గ్రహిస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఫిమేల్ కంటెస్టెంట్స్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే ఇన్ని రోజులు బాగానే ఉన్నవారు కాస్త ఫైనల్స్ కు చేరుకొనే సరికి ఆడియెన్స్ ను ఎమోషనలైజ్ చేస్తున్నారా అనిపిస్తుంది. అందులో ముందుగా అరియనా పేరునే చెప్పాలి. ఆ మధ్య ఎప్పుడో సింపతీ ప్లే చేసింది అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వేశారు.

కానీ అప్పటి నుంచి ఆమె ఆటలో చాలా చేంజ్ చూపించి చాలా క్లియర్ పాయింట్స్ తో ఇక్కడి వరకు వచ్చింది. కానీ తీరా ఈ సమయంలో కూడా అలా ఉండి ఉంటే బాగుండేది కానీ నిన్నటి టాస్క్ లో గోల్డెన్ మైక్ గెలుచుకొని తనకి ఓట్ చెయ్యమని అడిగే సమయంలో ఎమోషనల్ అయ్యింది.

అది ఏమాత్రం నాచురల్ గా వ్యూవర్స్ కి అనిపించలేదు. ఏదో కావాలని సింపతీ కోసమే చేసినట్టు అనిపించక మానదు. మరి ఇలాంటి టైం లో ఇలాంటి సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే ఆడియెన్స్ మళ్ళీ వెనక్కి నెట్టేస్తారు. మరి అరియానా ఈ విషయాన్ని గమనించిందో లేదో చూడాలి.

Exit mobile version