ఈ డైరెక్టర్ యాక్టర్ గా బిజీ అవుతాడట !

Published on May 29, 2019 3:00 am IST

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌’. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న విడుద‌ల అవుతోంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ కీలకమైన పాత్రలో నటించాడు. కాగా ఆల రెడీ సినిమాను చూసేసిన నేచురల్‌ స్టార్ నాని, తరుణ్ భాస్కర్‌ ను ఓ రేంజ్ లో పొగిడాడు.

నాని, తరుణ్ భాస్కర్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఫలక్‌నుమాదాస్ సినిమా నేను చూసి మాట్లాడుతున్నాను. తరుణ్ భాస్కర్‌ కి ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్‌ గా ఇచ్చేయొచ్చు. నిజంగా తరుణ్ డైరెక్షన్ మానేసి, యాక్టర్‌ గా కంటిన్యూ చేస్తే.. డైరెక్టర్ కంటే యాక్టర్ గా మూడు రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు అని నాని తరుణ్ భాస్కర్‌ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

మరి తరుణ్ భాస్కర్‌ ఎలా నటించాడో ఈ నెల 31న తేలనుంది. తరుణ్ గాని నాని మాటల్లో అద్భుతంగా నటిస్తే మాత్రం ఇక ఈ డైరెక్టర్ కి యాక్టర్ గా వరుసగా సినిమాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

More