గామి, భీమా చిత్రాలకి పోటీగా ఈ డబ్బింగ్ సినిమా!

గామి, భీమా చిత్రాలకి పోటీగా ఈ డబ్బింగ్ సినిమా!

Published on Feb 26, 2024 3:08 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గామి. టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం భీమా. ఈ రెండు చిత్రాలు మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మలయాళం లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలు మూవీ తెలుగు లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది.

ఈ చిత్రం రిలీజ్ కి మార్చ్ 8 వ తేదీని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రేమలు చిత్రం కి సంబందించిన తెలుగు డబ్బింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గిరీష్ AD దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు