“రాధే శ్యామ్”లో ఈ అంశంపైనే బిగ్గెస్ట్ ట్విస్టులు.!

Published on Mar 17, 2021 5:01 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రంపై ఎప్పటి నుంచో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది. ఈ గాసిప్ ప్రకారం ఈ చిత్రంలో కొన్ని భారీ ట్విస్టులే ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సమాచారం ప్రకారం ప్రభాస్ మరియు గీతలను ఉద్దేశించి ఉండే సన్నివేశాలు అత్యంత కీలక పాత్రలు పోషిస్తాయట. ఇవే ప్రభాస్ మరియు పూజా హెగ్డేల పాత్రలు చుట్టూ అతి పెద్ద ట్విస్టులు చూపిస్తాయని తెలుస్తుంది. దర్శకుడు రాధా కృష్ణ కాన్సెప్ట్ లో వీటి ఆధారంగానే మంచి స్క్రీన్ ప్లే ను చూపించనున్నాడట. మరి అద్భుత ప్రేమ కావ్యంలో కంటెంట్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలి అంటే వచ్చే జూలై 30 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :