“వకీల్ సాబ్”కు మించిన యుఫోరియా ఈ ఫస్ట్ లుక్ కు..!

“వకీల్ సాబ్”కు మించిన యుఫోరియా ఈ ఫస్ట్ లుక్ కు..!

Published on Feb 25, 2021 7:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ స్టార్డం కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మరి అంత క్రేజ్ ఉండి కూడా పవన్ భారీ గ్యాప్ తీసుకొని వచ్చినప్పటికీ అంతే స్థాయి అంచనాలను తన సినిమాపై తెచ్చుకున్నాడు. అయితే అలా రెండేళ్లు విరామం అనంతరం దర్శకుడు శ్రీరామ్ వేణుతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ “వకీల్ సాబ్”. పవన్ కం బ్యాక్ సినిమాతో గత ఏడాది ఈ టైం కి అలా వేరే లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా అప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో సెన్సేషన్ నే నమోదు చేశారు పవన్ అభిమానులు. ఇక ఇదే అనుకుంటే దాని యుఫోరియాను ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ వండర్ సినిమా క్లీన్ చేసేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఒకింత వకీల్ సాబ్ కన్నా ఈ చిత్రంపైనే పవన్ అభిమానులు ఎక్కువ ఉత్సుకత కనబరుస్తున్నారని చెప్పడం కూడా సరైనదే..

మరి ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే మార్చ్ 11కి ఫిక్స్ చేశారు అన్న టాక్ రాగానే అప్పుడు వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ మేనియా కి మించిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది..ఈ అప్డేట్ కు కూడా సోషల్ మీడియా అంతా అలానే ఉంది. మరి ఫస్ట్ లుక్ రోజున ఎలా ఉంటుందో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు