విజయ్ మూవీపై ఆసక్తికర అప్డేట్ ఇస్తారట.

Vijay2

విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. విజయ్ సరసన నయనతార నటిస్తుండగా ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ ఘనవిజయం సాధించడంలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా విజయ్ తన 64వ చిత్రంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మూవీ పై ఓ ఆసక్తికర అప్డేట్ నేటి సాయంత్రం ఇవ్వనున్నారని వినికిడి. విజయ్ ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారని సమాచారం. త్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఈఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version