“బిగ్ బాస్ 4” నుంచి ఊహించిన కంటెస్టెంటే ఎలిమినేటెడ్.?

Bigg Boss 4

ప్రతీ వారాంతం లానే ఈ వారాంతం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత వారం కొన్ని కీలక పరిణామాల వల్ల బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. దీనితో ఇప్పుడు ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నది తెలుస్తుంది.

గత వారం తన ఏవిక్షన్ పాస్ తో సేవ్ అయిన అవినాషే ఈసారి ఎలిమినేట్ అయ్యాడట. ఇది ముందే ఊహించిందే అని చెప్పాలి. అతి తక్కువ వోటింగ్ తో అవినాష్ గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు తన దగ్గర పాస్ ఉండడంతో తాను అప్పుడు సేవ్ అవ్వగలిగాడు.

కానీ ఈసారి కూడా అతడే అయ్యిపోతాడని చాలా మంది ఊహించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే అతడు నిన్న ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. అది ఈరోజు రివీల్ చెయ్యనున్నారు. మరి ఎలిమినేట్ అయ్యింది అవినాషేనా కాదా అన్నది తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version