రామ్ లేటెస్ట్ మాస్ కాంబోకు ఈ హీరోయిన్ ఫిక్స్.?

Published on Feb 24, 2021 9:00 am IST

“ఇస్మార్ట్ శంకర్” సినిమాతో మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సంపాదించుకున్నాడు. ఇక అక్కడ నుంచి మళ్ళీ “రెడ్” అనే మరో మాస్ రీమేక్ తో టాక్ తోని సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ ను కొట్టాడు. అయితే మరి ఇదే మాస్ హిట్ ట్రాక్ ను కొనసాగించాలని మరో పవర్ ఫుల్ మాస్ దర్శకుడు ఎన్ లింగుసామితో ఓ మాస్ మసాలా ప్రాజెక్ట్ ను ఇటీవలే అనౌన్స్ చేసారు.

తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను మేకర్స్ లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. మరి అలాగే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :