మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందట. ఇప్పుడు ఆ పాత్రలోనే హిప్పీ హీరోయిన్ దిగంగన సూర్యవంశిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ టీవీ సీరియల్ నటిగా రాణించిన ఈ అమ్మడు గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేసింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ మాత్రం రాలేదు. మరో గోపీచంద్ సినిమాతోనైనా హీరోయిన్ గా బిజీ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
