“సర్కారు వారి పాట”లో కూడా అదే హీరోయిన్.?

Published on Jun 3, 2020 3:48 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో పట్టాలెక్కనున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. టైటిల్ తోనే విపరీతమైన హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు.

ఇదిలా ఉండగా మరోపక్క ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. తాజాగా స్టోరీ లైన్ కు సంబంధించి పలు గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా ఒకరు ఫిక్స్ అయ్యినట్టు వినికిడి.

ఇంతకు ముందే సూపర్ స్టార్ తో “భరత్ అనే నేను” లో జోడిగా కనిపించి మెప్పించిన కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. ఈ జోడి అంటే మహేష్ ఫ్యాన్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కూడా..మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ వారు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More