“విజయ్ 12” కి ఆ ఇద్దరిలో ఈమె ఫిక్స్?

“విజయ్ 12” కి ఆ ఇద్దరిలో ఈమె ఫిక్స్?

Published on Feb 13, 2024 5:08 PM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురామ్ పెట్లతో “ఫ్యామిలీ స్టార్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత కూడా సాలిడ్ లైనప్ తో తాను బిజీగా ఉండగా ఈ చిత్రాల్లో తన 12వ చిత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మొదటి నుంచి కూడా కాస్త ఆసక్తికర వాతావరణం నెలకొంది.

అయితే ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని “సప్త సాగరాలు దాటి” ఫేమ్ రుక్మిణి వసంత్ అలాగే “అనిమల్” సెన్సేషన్ త్రిప్తి దిమ్రి లు టాక్ వచ్చింది. అయితే వీరిలో దాదాపు త్రిప్తి నే లాక్ అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అలాగే దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా తొందరలోనే వస్తుందని కూడా టాక్. మరి ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు