విజయశాంతిని అనిల్ రావిపూడి ఎలా ఒప్పించాడంటే..!

విజయశాంతిని అనిల్ రావిపూడి ఎలా ఒప్పించాడంటే..!

Published on Jan 8, 2020 11:30 PM IST

anil

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తరువాత మేకప్ వేసుకున్నారు. ఆమె చివరిగా 2006లో నాయుడమ్మ అనే చిత్రంలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి అనే కాలేజ్ ప్రొఫెసర్ రోల్ చేస్తున్నారు. రాజకీయాలలో బిజీ అయిన తరువాత విజయశాంతి సినిమా వైపు చూడలేదు.ఇక ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు అనుకున్న తరుణంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెతో రీఎంట్రీ చేయించారు. గతంలో చాలా మంచి విజయశాంతి గారికి అనేక కథలు వినిపించినా..ఆమె నటించడానికి ఆసక్తి చూపలేదు. అలాంటిది అనిల్, విజయ శాంతిని ఎలా ఒప్పించగలిగారు అనే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.

మొదట్లో విజయశాంతి అనిల్ ఆఫర్ ని తిరస్కరించారట. ఐతే అనిల్ ముందు కథ… అందులోని మీ పాత్ర గురించి వినండి అన్నారట. కథ విన్న తరువాత సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యత రీత్యా విజయశాంతి ఒప్పుకున్నారట. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి పాత్ర కేవలం ఆమె కోసమే రాశాను అన్నారు. ఆ పాత్రలో ఆమెను మినహా ఎవరిని ఉహించుకోలేను అని చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు