ఇలా “కల్కి 2898 ఎడి” మొదలైందట.!

ఇలా “కల్కి 2898 ఎడి” మొదలైందట.!

Published on May 26, 2024 3:01 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మాసివ్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి.

మరి ఈ సినిమాపై వినూత్న ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తుండగా అభిమానులు ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా నెల రోజుల్లో సినిమా థియేటర్స్ రానుండగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. అసలు ఈ భారీ సినిమా ఎలా మొదలైంది ప్రభాస్ ఎలా వచ్చాడో రివీల్ అయ్యింది.

ఈ సినిమా కోసం ముందు నేరుగా ప్రభాస్ ని మేకర్స్ సంప్రదించలేదట. మొదట దివంగత కృష్ణం రాజు గారికి లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కాల్ చేసి తమ దగ్గర ఈ సబ్జెక్టు ఉందని ఇది ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని ప్రభాస్ కి మీరు ఒక మాట చెప్పాలని అడిగారట. అలా ఈ భారీ చిత్రం మెటీరియలైజ్ అయ్యి వచ్చిందట. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి ఇప్పుడు వరకు సినిమా ఏ లెవెల్లో వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు