సైరా చూసిన రాజమౌళి రియాక్షన్ ఏంటంటే…!

సైరా చూసిన రాజమౌళి రియాక్షన్ ఏంటంటే…!

Published on Oct 2, 2019 6:00 PM IST

తెలుగు సినీ పరిశ్రమ తెరకెక్కించిన మరో భారీ చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల నడుమ ఈ రోజు దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. తారస్థాయిలో ఉన్న అంచనాలను అందుకుంటూ ఘనవిజయంగా నిలిచింది. `బాహుబలి`తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి సైరా సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు.

“శ్రీ ఉయ్యలవాడ నర్సింహారెడ్డిగారి పాత్రకి చిరంజీవిగారు జీవం పోశారు. చరిత్ర మరిచిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చారు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా ప్రతీ పాత్ర కథలో భాగమవుతూ మరింత ఆసక్తిని కలిగించాయి. బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్‌కు హృదయపూర్వక అభినందనలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు