సన్నీ లియోన్ నంబర్ అడిగితే ఏమి చేసిందంటే

Published on Feb 20, 2020 11:07 pm IST

ప్రఖ్యాత దబ్బో రత్నాని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ లోని దాదాపు టాప్ హీరోయిన్స్ ఈ క్యాలెండరు షూట్ నందు పాల్గొన్నారు. కియారా, అనన్య, ఐశ్వర్య, భూమి పెడ్నేకర్, సన్నీ లియోన్, జాక్విలిన్ వంటి తారలు క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొని ఫోజులిచ్చారు. కాగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

సీనియర్ నటుడు కబీర్ బేడీ సన్నీ లియోన్ ఫోటోలకు చాలా ఇంప్రెస్స్ అయ్యారట. దీనితో ఈ ఈవెంట్ లో సన్నీ లియోన్ ని స్వయంగా కలిసిన కబీర్ బేడీ ఫోటోలలో అద్భుతంగా ఉన్నారు అని ఆమెను పొగడడంతో పాటు, తన పర్సనల్ ఫోన్ నంబర్ కావాలని అడిగారట. అంత పెద్ద సీనియర్ నటుడు నంబర్ అడగడంతో ఇవ్వను అని గట్టిగా చెప్పలేని సన్నీ తెలివిగా వాళ్ళ భర్త నంబర్ ఇచ్చిందట. తన ఫోన్ నంబర్ ఇవ్వకుండా సన్నీ తప్పించుకున్న తీరుకు మెచ్చుకోవాల్సిందే.

this how sunny leone reacted when kabir bedi asks her phone number

సంబంధిత సమాచారం :

X
More