వెంకీ మామ చూసిన థమన్ రియాక్షన్ ఏంటంటే..!

వెంకీ మామ చూసిన థమన్ రియాక్షన్ ఏంటంటే..!

Published on Dec 4, 2019 11:28 AM IST

వెంకీ మామ చిత్ర విడుదలపై ఉన్న సందిగ్దతకు తెరదించుతూ రెండు రోజుల క్రితం చిత్ర విడుదల తేదీ ప్రకటించేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే డిసెంబర్ 13న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వెంకటేష్, చైతన్య మామా అల్లుళ్లుగా నటించడంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో వస్తున్న చిత్రం కావడంతో వెంకీ మామ మూవీపై అంచనాలు బాగా ఉన్నాయి. విడుదలకు కేవలం తొమ్మిదిరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. హీరోలు వెంకీ, చైతూ హీరోయిన్ రాశి ఖన్నా లతో పాటు, దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా చిత్ర దర్శకుడు బాబీ మాట్లాడుతూ సినిమా చూసిన అందరూ అభినందనలు తెలిపారని. దీనితో మూవీ విజయంపై విశ్వాసం పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మూవీ సెకండ్ హాఫ్ చూసిన వెంటనే ఎమోషనల్ ఐయ్యారన్నారు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయన్నారు. నన్ను గట్టిగా హగ్ చేసుకొని సినిమా బాగా తీశావని అభినందించడం మరిచిపోలేని సంఘటన అని బాబీ చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు