ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అనడానికి నిదర్శనం ఇదే

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అనడానికి నిదర్శనం ఇదే

Published on Mar 17, 2023 2:20 AM IST


మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మొదటి పాన్ ఇండియన్ మూవీ ధమ్కీ ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22, 2023న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఇక రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ హాజరవుతారని ఇప్పటికే టీమ్ కన్ఫర్మ్ చేసింది. నిజానికి ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి తాను ఎన్టీఆర్‌ని సంప్రదించలేదని విశ్వక్సేన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. తన గత సినిమా అశోక వనములో అర్జున కళ్యాణం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావాల్సి ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని ఆయన వెల్లడించారు.

అనంతరం ఎన్టీఆర్ అన్న నా సినిమా ఈవెంట్‌కి త్వరలో హాజరవుతానని హామీ ఇచ్చారని విశ్వక్సేన్ అన్నారు. ఇటీవల తారకరత్నని కోల్పోయిన వారి కుటుంబం వ్యక్తిగతంగా బాధల్లో ఉండడంతో ఇటువంటి సమయంలో తన మూవీ ఈవెంట్ కి ఆయనని రమ్మని పిలవడం కరెక్ట్ కాదని అనిపించిందని అన్నారు. అయితే ఎన్టీఆర్‌ స్వయంగా తనకు ఫోన్ చేసి ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతానని, టీమ్‌కి నచ్చిన తేదీని నిర్ణయించమని చెప్పడంతో తాము డేట్ ఫిక్స్ చేసినట్లు విశ్వక్సేన్ వెల్లడించారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అనడానికి ఈ సంఘటన గొప్ప నిదర్శనం అని పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఆయన పై ప్రసంశలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు