ఈ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ క్యాన్సల్ అయిందా ?

Published on May 31, 2019 9:08 am IST

స్టార్ హీరో సూర్యతో తన తరువాత సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది. శివ రజినీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ క్యాన్సల్ అయింది అంటున్నారు. కాగా వచ్చే ఏడాది చివర్లో తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్నట్లు శివ చెబుతున్నారట. ఇక రజినీతో చేయబోయే సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా రజినీ క్యారెక్టర్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

ఇక గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు. అయితే తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. దాంతో రజినీ, సినిమా చెయ్యడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :

More