బాలయ్య కామెంట్స్ కి నిర్మాత సి.కళ్యాణ్ వివరణ.

Published on May 29, 2020 12:02 am IST

నేడు మీడియా ముఖంగా టాలీవుడ్ లో జరుగుతున్న కార్యక్రమాలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కి సంబంధించి ప్రభుత్వంతో జరుగుతున్న ఏ మీటింగ్ కి తాను ఆహ్వానం లేదన్న బాలకృష్ణ, తలసానితో కలిసి అందరూ హైదరాబాద్ భూములు పంచుకుంటున్నారా అని తీవ్ర కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణ సన్నిహితుడు నిర్మాత సి కళ్యాణ్ వివరణ ఇచ్చారు.

దాసరి తరువాత చిరంజీవి ముందుకు వచ్చి టాలీవుడ్ అభివృద్ధి బాధ్యత తీసుకున్నారు. ఇంకా ఎవరైనా ఆ బాధ్యత తీసుకోవాలని అనుకుంటే వచ్చి ముందుకు నడవవచ్చు అన్నారు. గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లానని కల్యాణ్ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను సినీ ప్రముఖులు కలిసిన మీటింగ్‌కి బాలకృష్ణని పిలవాల్సిన బాధ్యత ‘మా’ అసోసియేషన్‌ ది అని ఆయన గుర్తు చేశారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి మంత్రి తలసాని లీడ్‌ తీసుకున్నారని చెప్పారు. టాలీవుడ్ లో ఎవరి మధ్య విభేదాలు లేవని, అంతా ఒక్కటేనని సీ కల్యాణ్ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం :

More