వాళ్ళ విమర్శలు సమంతలో కసిని పెంచాయట.

Published on May 29, 2020 12:13 pm IST

సమంత అక్కినేని చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇక వారు అడిగే అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కాగా ఒకరు సమంతను నిన్ను ద్వేషించే వారి పట్ల మీ అభిప్రాయం ఏమిటని అని అడిగితే సమంత చెప్పిన సమాధానం ముచ్చటేసింది. ద్వేషించే వారు మరియు విమర్శకులు సమంతలో ఇంకా బాగా నటించాలనే కసిని పెంచుతారట. పొగడ్తలు తనను బద్ధకస్థురాలిగా మారుస్తాయట. కాబట్టి హేటర్స్ ఆవిధంగా తనకు మేలే చేస్తున్నట్లు సమంత చెప్పింది. నెగెటివ్ కోణంలో పాజిటివ్ కోణాన్ని వెతుకున్న సమంతను పొగడకుండా ఉండలేం.

సమంత తెలుగులో కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో ఆమె ఓ చిత్రం చేస్తుంది. అలాగే హిందీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో సమంత నటించడం విశేషం. సమంత నెక్స్ట్ మళ్ళీ భర్త నాగ చైతన్యతో నటించే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. ఇక గత ఏడాది వీరు కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్ అందుకుంది.

సంబంధిత సమాచారం :

More