మహేష్ సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనేనట… !

మహేష్ సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనేనట… !

Published on Oct 10, 2019 7:11 AM IST

టాలీవుడ్ లో మహేష్ ది ప్రత్యేక స్థానం. నటశేఖర్ కృష్ణ వారసుడుగా తెరంగేట్రమ్ చేసిన మహేష్ అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆచితూచి సినిమాలు చేసే మహేష్ ఇన్నేళ్ల కెరీర్ లో చేసింది కేవలం 25సినిమాలు మాత్రమే. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న మహేష్ కి అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అన్ని వర్గాలలో ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా ఫోటో షూట్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూ లో మీరు సూపర్ స్టార్ గా ఎదగడానికి కారణాలేమిటి..? అని అడుగగా, మహేష్ బాల్యంలో, తండ్రి కృష్ణ వేసవి సెలవులలో నా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించు అని అడుగగా మహేష్ సరేనన్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారి సినిమాలలో నటించడం నా ఎదుగుదలకు కారణమైందన్న మహేష్, పరోక్షంగా ఆయన స్టార్ హీరోగా ఎదగడానికి తండ్రి కృష్ణ గారే అని జవాబు చెప్పారు.
బాల నటుడిగా తొమ్మిది సినిమాలు చేసిన మహేష్ వాటిలో ఏడు సినిమాలు కృష్ణ తో చేశారు. బాల చంద్రుడు సినిమాకి కృష్ణ దర్శకుడిగా వ్యవహరించారు. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు