రాజమౌళి, పూరిలపై మహేష్ ఆసక్తికర కామెంట్..!

Published on Jun 2, 2020 7:20 am IST

బయట పెద్దగా కనిపించడానికి ఇష్టపడని మహేష్ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టీవ్ గా ఉంటారు. ఇక ఆయన తన తండ్రి కృష్ణగారి పుట్టినరోజున తన కొత్త చిత్రం సర్కారు వారి పాట పఫస్ట్ లుక్ విడుదల చేయడమే కాకుండా ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేశారు. మహేష్ ఇష్టపడే వంటకాలు, చదివే పుస్తకాలు మరియు మహేష్ దిన చర్య మొత్తం తెలియజేశారు. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా గురించి కూడా ఆయన కామెంట్ చేశారు.

రాజమౌళితో మూవీ ఉంది, అందరిలాగే ఆయనతో పని చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్నారు. ఐతే ఈ మూవీ గురించి అంతకు మించి మహేష్ ఏమి చెప్పలేదు. ఇక మహేష్ కి పోకిరి, బిజినెస్ మాన్ వంటి చిత్రాలు ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్ తనకు ఇష్టమైన దర్శకులలో ఒకరు అన్నారు. ఆయనతో మళ్ళీ పని చేయాలని భావిస్తున్నాను అని చెప్పడం విశేషం.

సంబంధిత సమాచారం :

More