“ఫ్యామిలీ స్టార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!?

“ఫ్యామిలీ స్టార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!?

Published on Mar 31, 2024 6:33 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (Family star). ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ గా నిలవాలంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 38 కోట్ల రూపాయలకి పైగా షేర్ ను వసూలు చేయాల్సి ఉంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను బాగానే చేస్తున్నారు. గీతా గోవిందం చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, వసూళ్లు పెద్ద విషయమేమీ కాదు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు