విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే

విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే

Published on Apr 24, 2024 2:00 AM IST

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించారు.

మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు విజయ్. విషయం ఏమిటంటే, కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయనున్నారనే న్యూస్ నేడు ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

నిన్న ఒక ముఖ్య పని మీద హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్, ఆ సందర్భంలో విజయ్ ని కలిసారని ఆ సమయంలో వీరిద్దరి కాంబో మూవీ కథా చర్చలు జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, వారిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు