ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఖాయమే.. ఇదిగో ప్రూఫ్.

Published on Jun 4, 2020 9:26 am IST

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లాంఛనమే అని మరో సారి హింట్ వచ్చింది. ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు ఆ సినిమాపై పరోక్షంగా ప్రకటన చేశారు. మే 20న ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని న్యూక్లియర్ ప్లాంట్ తో పోల్చాడు. ఈ సారి ప్లాంట్ రేయేషన్ తట్టుకోవడానికి రేడియేషన్ సూట్ తో వస్తాను అని చెప్పారు. అలాగే త్వరలో కలుద్దాం అని కూడా ప్రశాంత్ నీల్ చెప్పడం జరిగింది.

ఈ ట్వీట్ కి కొనసాగింపుగా మైత్రి మూవీ మేకర్స్ త్వరలో ప్రశాంత్ నీల్ ని రేడియేషన్ సూట్ లో కలవడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్ చేశారు. దీనితో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో విడుదల కానుంది. 2021చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More