లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ కానున్న మొదటి భారీ బాలీవుడ్ సినిమా!

Published on May 26, 2020 11:08 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఆలియా భట్ కూడా ఒకరు. అలాగే అక్కడ చారిత్రాత్మిక చిత్రాలను తియ్యడంలో దిట్ట అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ అనంతరం ముంబైలో వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది అని అందుకు సంబంధించిన షూటింగ్ అనుమతులను కూడా సంజయ్ లీలా భన్సాలీ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఆలియా ఒక లేడీ డాన్ రోల్ లో కనిపిస్తుండగా సంజయ్ ఈ చిత్రాన్ని అధికంగా నూతన తారాగణంతో తెరకెక్కించనున్నారు.

సంబంధిత సమాచారం :

More