“సలార్” మేకర్స్ తో అఖిల్ ప్రెజెన్స్ కారణమిదే?

“సలార్” మేకర్స్ తో అఖిల్ ప్రెజెన్స్ కారణమిదే?

Published on Jan 25, 2024 11:02 AM IST

అక్కినేని యంగ్ అండ్ మాస్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ఏజెంట్” అనుకున్న రేంజ్ విజయం సాధించకపోయినప్పటికీ ఈ చిత్రం తర్వాత అఖిల్ చేయనున్న ప్రాజెక్ట్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విషయంలో ఓ సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులు అఖిల్ అక్కినేని ప్రశాంత్ నీల్ మరియు సలార్ చిత్రం యూనిట్ తో కలిసి కనిపించడం ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చింది.

మరి అసలు ఆరోజు అఖిల్ ఎందుకు కనిపించాడు అనే దానిపై క్లారిటీ వినిపిస్తుంది. కేజీయఫ్, సలార్ మేకర్స్ అయినటువంటి నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా నిర్మాతగా మారి అఖిల్ తో భారీ చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ ఆరోజు కనిపించారని ఇప్పుడు స్ట్రాంగ్ బజ్. మరి ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా భాగం కానున్నారని టాక్. మొత్తానికి ఆరోజు మంచి హాట్ టాపిక్ గా మారిన అంశంపై బ్యాక్ స్టోరీ ఇది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు