ప్రభాస్ ‘సలార్’ స్టోరీ లైన్ ఇదే – డైరెక్టర్ ప్రశాంత్ నీల్

ప్రభాస్ ‘సలార్’ స్టోరీ లైన్ ఇదే – డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Published on Nov 29, 2023 3:04 AM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ మూవీ డిసెంబర్ 22న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ పాత్రలు చేస్తున్నారు.

విషయం ఏంటంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా సలార్ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఇద్దరు ప్రాణ స్నేహితులు కొన్ని కారణాల వలన బద్ద శత్రువులుగా మారుతారని, కాగా వారిద్దరి మధ్య సాగే కథే సలార్ అని అన్నారు. ముఖ్యంగా హృద్యమైన ఎమోషన్స్ తో ఈ మూవీ సాగుతుందని తెలిపారు. ఆకట్టుకునే కథనంతో సాగే ఈ మూవీ యొక్క సగం కథ ఫస్ట్ పార్ట్ లో అలానే మిగతా స్టోరీ సెకండ్ పార్ట్ లో వస్తుందని తెలిపారు. తన సినిమాలో మాదిరిగా ఇందులో కూడా సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయని, యాక్షన్ సీన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. కాగా ఈమూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు