“జరగండి” లిరికల్ లో బాగా మిస్సయిన ఈ ఎలిమెంట్

“జరగండి” లిరికల్ లో బాగా మిస్సయిన ఈ ఎలిమెంట్

Published on Mar 28, 2024 9:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే వేడుకలు అభిమానులు గ్రాండ్ గా నిన్న జరుపుకున్నారు. మరి ఈ స్పెషల్ డే కానుకగా తన నుంచి రానున్న చిత్రాల నుంచి పలు సాలిడ్ అప్డేట్ లు ట్రీట్ లు కూడా వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” (Game Changer) కూడా ఒకటి. మరి దీని నుంచి నిన్న వచ్చిన అవైటెడ్ సాంగ్ జరగండి సూపర్ హిట్ అయ్యింది.

అయితే నిన్న సాయంత్రం చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపగా ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా జరగండి(Jaragandi) సాంగ్ కి స్టెప్పేయడం వైరల్ గా మారింది. అయితే ఈ సాంగ్ వచ్చాక కొంతమేర మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. మొదటిగా పాడించిన గాయకులని మార్చడంతో ఆ వెర్షన్ కోసం కోరుకునేవారు లేకపోలేరు. అయితే ఇది పక్కన పెడితే లిరికల్ లో చాలా గ్రాండ్ విజువల్స్ ని మేకర్స్ చూపించారు.

అయినా కూడా ఒక కీలక ఎలిమెంట్ అయితే ఇందులో మిస్ అయ్యింది అని చెప్పాలి. ప్రస్తుతం వస్తున్నా ట్రెండ్ లో ఖచ్చితంగా లిరికల్ సాంగ్స్ లో ఓ హుక్ స్టెప్ ని పెడుతుండడం మనం చూస్తున్నాం వాటి వల్ల కూడా ఆ సాంగ్ కి మరింత క్రేజ్ పెరుగుతూ వస్తుంది. మరి ఇది ఈ సాంగ్ లో కనిపించకపోవడం గమనార్హం.

ప్రభుదేవా లాంటి కొరియోగ్రఫర్ ఉన్నప్పటికీ ఇన్స్టంట్ గా చూసిన వెంటనే క్లిక్ అయ్యేలా స్టెప్స్ పెద్దగా కనిపించలేదు. ఇది మాత్రం ఈ సాంగ్ లో లోటే అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు