అక్షయ్ పై కూడా ఫేక్ వార్తలు.?

అక్షయ్ పై కూడా ఫేక్ వార్తలు.?

Published on Mar 3, 2024 2:00 AM IST


బాలీవుడ్ సినిమా దగ్గర మంచి స్టార్డం అండ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఇప్పుడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చేస్తున్న “బడేమియా చోటేమియా” చిత్రంతో పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమాతో పాటుగా మరో విధంగా కూడా ఇప్పుడు అక్షయ్ కుమార్ పేరు వార్తల్లోకి ఎక్కింది.

అయితే అక్షయ్ కుమార్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు అని ఢిల్లీ నుంచి ఓ జాతీయ పార్టీ తరపున పోటీ కూడా చేయనున్నాడని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజం కాకూడదు అని ఫ్యాన్స్ కోరుకుంటుండడగా సరిగ్గా ఇదే తరహా వార్తలు తనపై ప్రచారం చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తిప్పి కొట్టాడు.

తాను పాలిటిక్స్ లోకి రావడం లేదని నాపై ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. అయితే సరిగ్గా ఇదే విధంగా అక్షయ్ పై కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అని అక్షయ్ రాజకీయాల్లోకి రాకూడదు అని తన అభిమానులు కూడా ఇప్పుడు కోరుకుంటూ తన నుంచి కూడా ఒక అఫీషియల్ క్లారిటీ కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు