AI సాయంతో విజయ్ సినిమాలో దివంగత హీరోని సృష్టి!?

AI సాయంతో విజయ్ సినిమాలో దివంగత హీరోని సృష్టి!?

Published on Apr 16, 2024 9:00 AM IST

కోలీవుడ్ నటుడు స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న భారీ అవైటెడ్ చిత్రమే “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” . మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తుండగా రీసెంట్ గానే సినిమా ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రం విషయంలో ఒక ఆసక్తికర వార్త కోలీవుడ్ సినీ వర్గాలు నుంచి బయటకి వచ్చింది.

ప్రస్తుత కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏ రీతిలో పరిణామం చెందుతుందో చూస్తున్నాం. ఎన్నో అద్భుతాల్ని దీనితో క్రియేటర్స్ చేస్తున్నారు. అలాగే దీనితో సినిమాల్లో కూడా కొన్ని ఊహించని ఇంద్రజాలాలనే చూపిస్తున్నారు. అలా లేని నటుల్ని కూడా ఎంతో సహజంగా ఈ కృత్రిమ మేధస్సు తయారు చేసేస్తుంది. దీని సాయంతోనే ఇప్పుడు విజయ్ సినిమాలో తమిళ దివంగత నటుడు విజయకాంత్ (Vijayakanth) ని సృష్టించబోతున్నారట.

ఈ ఏఐ తో సృష్టించిన విజయకాంత్ ప్రతిరూపాన్ని సినిమాలో విజయ్ తో పాటుగా చూపిస్తారని అందుకు గల పనులు అన్ని వెంకట్ ప్రభు చూసుకుంటున్నారు అని చెబుతున్నారు. దీనితో ఈ అంశం విషయంలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏఐ సహాయంతో మరిన్ని అద్భుతాలు తప్పకుండా చూస్తామని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు