ప్రభాస్ ను కలిసిన ఈ మాస్ దర్శకుడు.?

Published on Nov 28, 2020 3:01 am IST

ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక మోస్ట్ వాంటెడ్ హీరో. ప్రభాస్ తో ఇప్పుడు ఓ సినిమాకు ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అలా ఇప్పుడు ప్రభాస్ పలు భారీ చిత్రాలను లైన్ లో కూడా పెట్టారు. అయితే ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలతో పాటుగా ఓ పవర్ ఫుల్ దర్శకునితో కూడా సినిమా చేస్తాడని టాక్ వచ్చింది.

అతడే కేజీయఫ్ లాంటి మాస్ మసాలా సినిమా ఇచ్చి బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ సినిమాగా మలచిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కాంబోపై ఆ మధ్య మంచి టాక్ వచ్చింది కానీ రియాలిటీ లోకి రాలేదు. కానీ వీరి కాంబో నుంచి సినిమా అయితే ఉందని న్యూస్ ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం నీల్ ప్రభాస్ ను కలిసారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలాగే వీరి తమ సినిమా కోసమే మాట్లాడుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే నీల్ అండ్ ఎన్టీఆర్ ల కాంబోలో ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ తో నీల్ ఎలాంటి సినిమా తీస్తారు ఎప్పుడు ఈ కాంబో నుంచి సినిమా వస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More