“గేమ్ ఛేంజర్” కోసం రామ్ చరణ్ కి ఓవరాల్ ఇంత రెమ్యునరేషన్?

“గేమ్ ఛేంజర్” కోసం రామ్ చరణ్ కి ఓవరాల్ ఇంత రెమ్యునరేషన్?

Published on Apr 23, 2024 8:01 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంటుంది. అయితే ఈ చిత్రం కోసం ఇది వరకే రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు అని టాక్ ఉంది.

అయితే ఇది అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో ఓవరాల్ గా మరింత పెరిగింది అని లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో అయితే తాను మొత్తంగా 120 కోట్ల రెమ్యునరేషన్ ని గేమ్ ఛేంజర్ కోసం తీసుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి తదితరులు నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు