“బిగ్ బాస్ 4” లో మరో కీలక నటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!

Published on Sep 23, 2020 6:00 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ చాలా కాలం నిరీక్షణ తర్వాత మొదలయ్యి మొట్ట మొదటి ఎపిసోడ్ కే భారీ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం మిగతా ఎపిసోడ్స్ ఏమంత రంజకంగా లేకపోయేసరికి ఆడియెన్స్ లో రెస్పాన్స్ తగ్గింది. దీనితో ఎప్పుడో మొదలు పెట్టాల్సిన వైల్డ్ కార్డు ఎంట్రీలను కాస్త ముందుగానే మొదలు పెట్టేసారు.

అలా ఇప్పటికే ఇద్దరు తెలుగు మేల్ కంటెస్టెంట్స్ ను తీసుకు వచ్చారు. అలాగే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం మన తెలుగుకు చెందిన ఒక ప్రముఖ నటి మీనాక్షి దీక్షిత్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పరిచయం చేయనున్నట్టు తెలుస్తుంది. ఈమె ఎంట్రీ రేపు ఉండనుండగా ఈమె ఇప్పటికే అల్లరి నరేష్ తో తమిళ్ లో పలు చిత్రాల్లో కనిపించింది. మరి ఈమె ఎంట్రీ తర్వాత షోలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

More