సూపర్ హీరోల సినిమాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా మన భారతీయ సినీ ప్రేమికులు అలాంటి సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి పాత్రలపై కాస్త తక్కువ సినిమాలే రావడం అందులోని అతి తక్కువ సూపర్హీరోలే క్లిక్ అవ్వడం జరిగింది. మరి క్లిక్ అయిన రోల్స్ లో మాత్రం మొట్ట మొదటి ప్లేస్ లో ఉండేది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ చేసిన “క్రిష్” అనే చెప్పాలి.
ఎన్నో ఏళ్లగా ఈ సూపర్ హీరో పాత్రకు మన దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇదే రోల్ పై వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి. మన తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాల ఫ్రాంచైజ్ నుంచి రానున్న “క్రిష్ 4″పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే గత రెండు సినిమాల్లో కూడా హృతిక్ తో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి మరో స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెనే మన టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కియారా అద్వానీ. ఈమె కూడా క్రిష్ 4 లో మరో హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ఆసక్తికర గాసిప్స్ బయటకు వచ్చాయి. మరి మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ సూపర్ హీరో అయినటువంటి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
