అసలు ఈ 2020 కొత్త సంవత్సరం ఓ రేంజ్ లో ఉండాలి అని అంతా అనుకోని ఉంటారు కానీ ఇంకో రేంజ్ లో చూపించింది కరోనా వైరస్. అయితే దీని ప్రభావం మన దగ్గర అంత ప్రబలకుండా ఉన్నప్పుడుకే టాలీవుడ్ నుంచి కనీ వినీ ఎరుగని రేంజ్ బాక్సాఫీస్ యుద్ధం జరిగింది.
భారీ వసూళ్లతో శుభారంభం దొరికింది అనుకోని ఈ కొత్త ఏడాది ఇక ముందు బాక్సాఫీస్ వసూళ్లతో కళకళలాడుతుంది అని అనుకున్నారు. కానీ ఈ ఏడాది విడుదల కాబడ్డ సినిమాల్లో సాలిడ్ హిట్ చిత్రాలుగా కొన్ని మాత్రమే నిలిచాయి.
మరి ఈ లిస్ట్ లో ఇప్పుడు సాయి తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” నిలుస్తుంది అని చెప్పొచ్చు. చివరిగా నితిన్ నటించిన “భీష్మ” తో ఎండ్ అయిన ఈ లిస్ట్ మళ్ళీ ఇన్ని నెలలకు అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాను విడుదల చెయ్యడం ఒకెత్తు అయితే..
కేవలం 50 శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ తో బ్రేకీవెన్ కు దగ్గర కానుండడం ఇండస్ట్రీ వర్గాలలో ఆనందం నెలకొల్పింది. మరి అలాగే ఇదే కనుక జరిగితే ఈ ఏడాది ఈ రేర్ ఫీట్ కొట్టిన మొదటి హీరోగా సాయి తేజే నిలుస్తాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు.
