మహేష్ ను డైరెక్ట్ చేయనున్న ఈ సెన్సేషనల్ దర్శకుడు.?

Published on Mar 13, 2021 10:01 am IST

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ చిత్రం అనంతరం దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ కు గాను ఉన్న గ్యాప్ లో మరో దర్శకుడితో సినిమా చేస్తారని తెలిసింది. దీనికి గాను చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ ను డైరెక్ట్ చేసేందుకు మరో స్టార్ దర్శకుని పేరు వినిపిస్తుంది.

కాకపోతే అది సినిమా కోసం కాదట. అయితే అసలు విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నాడట. అది కూడా ఒక యాడ్ షూట్ కోసం అన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుందని కూడా టాక్.

మరి ఇదిలా ఉండగా ఆ మధ్య మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సందీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో పాన్ ఇండియన్ ఫ్లిక్ ఉంటుందని టాక్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు వీరి కొలాబరేషన్ నుంచి తమ ప్రాజెక్ట్ పై ఏమన్నా డిస్కషన్స్ జరుగుతాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :