‘వారణాసి’లో ఆ సీక్వెన్స్ వేరే లెవెల్..!

‘వారణాసి’లో ఆ సీక్వెన్స్ వేరే లెవెల్..!

Published on Sep 5, 2026 12:04 AM IST

Varanasi

డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, తాజాగా సినిమాలోని ఓ కీలకమైన బుల్ ఫైట్ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గ్లింప్స్‌లో విడుదలైన బుల్ ఎలివేషన్ షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి యాక్షన్ సీన్‌ను హైదరాబాద్ శివార్లలో వచ్చే వారంలో తెరకెక్కించనున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, రాజమౌళి శైలిలోనే ఈ ఫైట్‌లోనూ బలమైన ఎమోషన్ ఉండేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.

​దాదాపు రూ.1,300 నుంచి రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ పనులపై పూర్తి ఫోకస్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేసుకుని, ఈ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి మార్క్ మేజిక్ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు