“RRR”లో ఈ సెట్ మరో హైలైట్ అట.!

“RRR”లో ఈ సెట్ మరో హైలైట్ అట.!

Published on Mar 9, 2021 11:01 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “RRR”. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో మొత్తం తెలుగు నేలకు చెందిన స్వతంత్ర సమర యోధులు కొమరం భీం మరియు అల్లూరి సీతా రామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. మరి వీరికి ఫీమేల్ లీడ్స్ లో కూడా స్టార్ క్యాస్టింగ్ నే రాజమౌళి ఎంచుకున్నారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్చ్ రెండో వారంలో ఓ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ను చరణ్ మరియు ఆలియా భట్ లపై తీస్తున్నారని తెలిసింది. మరి ఈ సాంగ్ లో వేసిన స్పెషల్ సెట్ కోసం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సెట్ ను అత్యద్భుతంగా సాబు సిరిల్ డిజైన్ చేశారట. 1920ల దశకంలో రోజులకు అద్దం పట్టేలా ఇందులో దృశ్యాలు డిజైన్ చేశారని తెలుస్తుంది. మరి ఇంతలా హైప్ తెచ్చుకున్న ఈ సెట్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు