భీం టీజర్లో ఈ సీన్..ఆ పతాక సన్నివేశంలోదేనా?

Published on Oct 22, 2020 4:06 pm IST

ఇప్పుడు కొమరం భీం ఎన్టీఆర్ తన తుఫానుతో సోషల్ మీడియాను మరియు ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేస్తున్నాడు. అస్సలు ఊహించని రీతిలో రాజమౌళి తారక్ ను ప్రెజెంట్ చేసిన విధానం చూసి అయితే తారక్ అభిమానులను మాటలు రావడం లేదు. ఇన్నాళ్ల నిరీక్షణను ఈ టీజర్ తో జక్కన ఈ ఒక్క టీజర్ తో తుడిపేసారు. ఇందులో తారక్ పై చూపిన ప్రతీ షాట్ కూడా కామన్ ఆడియెన్స్ కు రోమాలు నిక్కబొడిచేలా చేసింది.

అయితే ఈ టీజర్ లాస్ట్ లో ఒక షాట్ ఉంటుంది రెండు తాళ్లు పట్టుకుని తారక్ లాగుతూ తన సిక్స్ ప్యాక్ లో కనిపిస్తుంది. అయితే ఈ షాట్ లో తారక్ ను కనుక బాగా గమనిస్తే ఈ చిత్రంలో రాజమౌళి ప్లాన్ చేసిన ఒక పతాక సన్నివేశం గుర్తుకు వస్తుంది. గత కొన్నాళ్ల కితం రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ చిత్రంలో ఒక భీకర పోరాట సన్నివేశం పులితో డిజైన్ చేసారని టాక్ వచ్చింది.

ఇప్పుడు అదే సన్నివేశంలోని షాట్ ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో తారక్ కు అయిన గాయాలలో పులి పంజా గుర్తులు కనిపిస్తాయి. సో ఈ షాట్ ఆధారంగా ఆ పతాక సన్నివేశం వెండితెర మీద ఓ రేంజ్ లో ఉండడం ఖాయం అని చెప్పాలి. మొత్తానికి మాత్రం జక్కన ఇండియన్ బాక్సాఫీస్ మీద గట్టిగానే కన్నేసినట్టున్నారు.

సంబంధిత సమాచారం :